రోడ్డు భద్రత అవగాహనపై తూప్రాన్‌లో ప్రత్యేక కార్యక్రమాలు
తూప్రాన్, జనవరి 8: రోడ్ సేఫ్టీ అవగాహన మాసం సందర్భంగా తూప్రాన్ సర్కిల్‌లో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సీఐ రంగ కృష్ణ, ఎస్సై జ్యోతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగాయి.
ఈ సందర్భంగా పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టి, ట్రాఫిక్ నిబంధనలు సక్రమంగా పాటిస్తున్న వాహనదారులను అభినందించారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, వేగ పరిమితులు పాటించడం వంటి రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా అనుసరిస్తున్న వారికి పండ్లు అందజేసి ప్రోత్సహించారు.
సీఐ రంగ కృష్ణ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో బాధ్యతాయుతమైన వాహనదారులుగా మారే అలవాట్లు పెంపొందించడం, రోడ్డు భద్రత ప్రాముఖ్యతను తెలియజేయడమే లక్ష్యమని తెలిపారు.

Post a Comment