భద్రాద్రి కొత్తగూడెంలో సీయం వైభవంగా కప్ టార్చ్ ర్యాలీ

భద్రాద్రి కొత్తగూడెంలో సీయం వైభవంగా కప్ టార్చ్ ర్యాలీ


రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SATG) మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 2nd ఎడిషన్ సీయం కప్ టోర్నమెంట్ లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టార్చ్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి రైల్వే స్టేషన్ వరకు ఉత్సాహంగా సాగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొత్తగూడెం శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావు గారు మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్రీడల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం అందిస్తానని అన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో యువతీ–యువకుల కోసం 44 క్రీడాంశాలలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ క్రీడాకారులు ఒలింపిక్ స్థాయిలో పతకాలు సాధించాలనే లక్ష్యంతోనే సీయం కప్ ప్రవేశపెట్టినట్టు పేర్కొన్నారు.

టార్చ్ ర్యాలీలో

DYSO ఎం. పరందామా రెడ్డి, క్రీడాసంఘాల ప్రతినిధులు యుగేందర్ రెడ్డి, మహిదర్, వెంకటేశ్వర్ రావు, రమేష్, ఖాసి హుస్సేన్, స్వాతిముత్యం, బాబి, జాన్సన్, శ్రీదర్, మొగిలి, రఘు, కోచ్‌లు డానియల్, కళ్యాణ్, మల్లికార్జున్, నాగేందర్, కార్యాలయ సిబ్బంది తిరుమల్ రావు, లక్ష్మయ్య, క్రీడాకారులు, యువకులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.