నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మోహీద్ పటేల్ నామినేషన్ దాఖలు
నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 12వ వార్డు నుంచి ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా నారాయణఖేడ్ ఎంఐఎం అధ్యక్షుడు, న్యాయవాది మోహీద్ పటేల్ గురువారం అధికారికంగా తన నామినేషన్‌ను దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియను పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తల నడుమ ఉత్సాహంగా పూర్తి చేశారు.
ఈ సందర్భంగా మోహీద్ పటేల్ మాట్లాడుతూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గతంలో కూడా ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశానని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పని చేశానని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో తనను 12వ వార్డు కౌన్సిలర్‌గా గెలిపిస్తే, వార్డు అభివృద్ధితో పాటు మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు ప్రజల సంక్షేమ కార్యక్రమాల అమలుపై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.
12వ వార్డు అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేసిన మోహీద్ పటేల్, ప్రజలు తనను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Post a Comment