సాటి మనిషికి సాయం చేయడం లో ఉండే తృప్తి అమోఘం – రబ్బానీ

 

సాటి మనిషికి సాయం చేయడం లో ఉండే తృప్తి అమోఘం – రబ్బానీ

చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పంచాయతీలో ప్రతి గురువారం నిర్వహించే సంతలో సామాన్య ప్రజలకు సేవలందించడం ద్వారా జమాత్-ఎ-ఇస్లామీ హింద్ సభ్యులు మానవతా విలువలను నిలబెడుతున్నారు. రుద్రంపూర్–రామవరం శాఖ అధ్యక్షుడు ముహమ్మద్ మాజీద్ రబ్బానీ ఆధ్వర్యంలో సంస్థ సభ్యులు పండ్లు, కూరగాయలు అమ్ముకునే వ్యాపారస్తులకు ఉచితంగా వేడి టీని పంపిణీ చేస్తున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రబ్బానీ,

“సాటి మనిషికి సాయం చేయడం లో ఉండే తృప్తి అమోఘం. మానవ సేవే మాధవ సేవ. చలికాలంలో కొంత ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో సుమారు 120 మందికి ప్రతి గురువారం వేడి టీ పంపిణీ చేస్తున్నాం” అని తెలిపారు.

వ్యాపారులు మాట్లాడుతూ,

ఈ చలిలో డబ్బులు ఇచ్చి టీ తాగేందుకు సమయం లేకపోతున్న సమయంలో ఉచితంగా టీ అందిస్తున్న జమాత్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు అబ్దుల్ బాసిత్, ముహమ్మద్ షమీం, ముహమ్మద్ మదార్ సాహెబ్, మన్నాన్, మదర్ థెరీసా సేవా సంస్థ అధ్యక్షుడు గూడెల్లి యాకయ్య, అజీం తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.