బెజ్జూర్ లో ఘనంగా ఆదివాసి కొలవార్ ఆత్మగౌరవ దినోత్సవ వేడుకలు
కొమురం భీం జిల్లా బెజ్జూర్ మండలంలోని గోల్కొండ గ్రామంలో గురువారం ఆదివాసి కొలవార్ ఆత్మగౌరవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 24వ భీమన్న దేవర జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి బెజ్జూర్ మండల అధికారులు MRO, SI, MEO తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సర్పంచ్ సరోజ దుర్గం సరోజ తిరుపతి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల అభ్యుదయానికి అనేక సంక్షేమ పథకాలు అమలులోకి తీసుకువస్తున్నాయని తెలిపారు.
మన్నేరువారు గా గుర్తింపు పొందిన కొలవార్ సామాజిక వర్గాన్ని PVTGగా గుర్తించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్–3లో సవరణ చేసి, వీరికి పూర్తి హక్కులు కల్పించాలని కోరారు. అంతరించిపోతున్న జాతుల్లో ఒకటైన ఈ తెగ ప్రజలు తీవ్రమైన పేదరికం, దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం ITDAల ద్వారా 100% రాయితీపై రుణాలు మంజూరు చేసి ఆర్థికంగా ఆదుకోవాలని సర్పంచ్ డిమాండ్ చేశారు. గతంలో మన్నేరువార్లకు రాయితీ రుణాలు లభించినప్పటికీ పలు సాంకేతిక కారణాలతో ఇప్పుడు పక్కకు పెట్టినట్లు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తక్కువ సంఖ్యలో ఉన్న ఈ వర్గాన్ని ప్రభుత్వం గుర్తించి రక్షణ కల్పించాలని కోరారు.
కార్యక్రంలో బెజ్జూర్ మండల అధ్యక్షులు పెద్దల సంతోష్, బుర్రి మంతయ్య, అమీర్ ఉద్‌దీన్, వార్డు సభ్యులు జాకీర్ హుస్సేన్, బండి సోనీ, కొడప శంకర్, మాజీ సర్పంచ్ పెద్దల సుగుణ, తల్ల లక్ష్మీ, బూర్రి సంధ్య, మౌనిక, చింతపుడి ప్రకాష్, పోశన్న, మైఖేల్ జాక్సన్, నందిని, పోషక్క, విలాస్, గణేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment