ITI (4 ఇంక్లైన్) లో క్రీడా విజేతలకు బహుమతులు
కొత్తగూడెం, జనవరి 26: 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ITI (4 ఇంక్లైన్) ప్రాంగణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిలినియం ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం ఛైర్పర్సన్‌గా లయన్ గబ్బేట విజయలక్ష్మి రాజయ్య హాజరై, క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు స్వయంగా బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిలినియం అధ్యక్షులు లయన్ బొక్క శ్రీనివాస్, కార్యదర్శి లయన్ నమిళ్ల నరేష్, ఖజానాదారు లయన్ పగడాల నగేష్, పాస్ట్ గవర్నర్ లయన్ డాక్టరేట్ V. శివప్రసాద్, డిస్ట్రిక్ట్ జాయింట్ ట్రజరర్ లయన్ పితాని సత్యనారాయణ గారు, పాస్ట్ RC లయన్ వెంకటపుల్లయ్య (RTA భద్రాచలం), డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్ లయన్ గబ్బేట రాజయ్య, డాక్టరేట్ లయన్ J.B. మోహన్, లయన్ మండల రాజేశ్వర్ రావు, పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ ఉజ్యల్ కుమార్ బెహరా, లయన్ బిట్టు గోవర్ధన్, లయన్ కోటేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా RTA భద్రాచలం పాస్ట్ RC లయన్ వెంకటపుల్లయ్య రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ విలువైన సూచనలు చేశారు.

Post a Comment