ఆర్మీ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
కొత్తగూడెం, జనవరి 26: 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆర్మీ కార్యాలయంలో దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ వాసర్ల నాగమణి గారి నేతృత్వంలో దిశ కుటుంబ సభ్యులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్మీ సిబ్బందిని పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో
- దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కడియం సీతా కుమారి,
- జిల్లా అధ్యక్షురాలు రెంటపల్లి మాధవి లత,
- కొత్తగూడెం జనరల్ సెక్రెటరీ బండి మంజుల,
- మణుగూరు మండల వైస్ ప్రెసిడెంట్ గంగులు కవిత,
- మణుగూరు మండల జనరల్ సెక్రెటరీ రాజ్యలక్ష్మితదితర దిశ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగ విలువలు, మహిళల భద్రత, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆర్మీ సిబ్బంది సేవలు అమూల్యమైనవని కొనియాడారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి. 🇮🇳

Post a Comment