భద్రాద్రి జిల్లా కోర్టులో మువ్వన్నెల రిపబ్లిక్ డే వేడుకలు

భద్రాద్రి జిల్లా కోర్టులో మువ్వన్నెల రిపబ్లిక్ డే వేడుకలు


కొత్తగూడెం న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్. సరిత, న్యాయమూర్తులు ఎం. రాజేందర్, కే. కిరణ్, కే. కవిత, ఏ. సుచరిత, బి. రవికుమార్, వి. వినయ్ కుమార్ పాల్గొన్నారు. అలాగే ఏపీపీ పివిడి లక్ష్మి కూడా హాజరయ్యారు.

కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జి. గోపీ కృష్ణ, ప్రధాన కార్యదర్శి బాగం మాధవరావు, కె. రమేష్, సాదిక్ పాషా, ఏ. పార్వతితో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.

Blogger ఆధారితం.