ఏప్రిల్ 1 నుంచి నూతన ఆదాయపు పన్ను చట్టం అమలు: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: రానున్న ఏప్రిల్ 1 నుంచి నూతన ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతూ ఆమె ఈ కీలక ప్రకటన చేశారు.
సామాన్య పన్ను చెల్లింపుదారులు సులభంగా రిటర్నులు దాఖలు చేసేలా ఆదాయపు పన్ను చట్టంలో పలు మార్పులు చేసినట్లు తెలిపారు. సరళీకృత ఆదాయపు పన్ను ఫారాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.
🔹 రిటర్నుల గడువు పెంపు
సవరించిన ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.
🔹 విదేశీ వ్యయాలపై టీడీఎస్ తగ్గింపు
- విదేశీ యాత్రలపై పన్ను తగ్గింపు
- విదేశీ విద్య, వైద్య ఖర్చులపై టీడీఎస్‌ను 5% నుంచి 2%కు తగ్గింపు
- మానవ వనరుల సరఫరా సంస్థలపై టీడీఎస్‌ను 1 లేదా 2 శాతానికి పరిమితం
🔹 పన్ను మినహాయింపులు
- రహదారి ప్రమాదాల పరిహార వడ్డీపై పన్ను రద్దు
- చిన్న మొత్తాల పన్ను బాకీల పరిష్కారానికి ప్రత్యేక పథకం
🔹 విదేశీ ఆస్తుల వెల్లడింపు తప్పనిసరి
ఇకపై విదేశీ ఆస్తుల వివరాలను వెల్లడించడం తప్పనిసరి అని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
🔹 బైబ్యాక్‌లపై పన్ను
- కార్పొరేట్ బైబ్యాక్‌లపై 2% పన్ను
- నాన్-కార్పొరేట్ బైబ్యాక్‌లపై 30% పన్ను
🔹 పన్ను వివాదాల్లో క్రిమినల్ చర్యల సడలింపు
పన్ను వివాదాల్లో క్రిమినల్ చర్యల తీవ్రతను తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
- జైలు శిక్షను రెండేళ్లకు తగ్గింపు
- జరిమానా చెల్లిస్తే జైలు శిక్ష నుంచి మినహాయింపు అవకాశం
ఈ మార్పులతో పన్ను వ్యవస్థ మరింత సరళంగా మారి, సామాన్య ప్రజలకు ఊరట కలగనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Post a Comment