ఉదయం 11 గంటల వరకు జిల్లాలో 29.30% పోలింగ్ నమోదు : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 11:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ ఎన్నికలు–2026 పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11.00 గంటల వరకు జిల్లావ్యాప్తంగా 29.30 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్ తెలిపారు.
జిల్లాలోని 3 పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని 106 వార్డులకు ఏర్పాటు చేసిన 288 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాంతియుత వాతావరణంలో సాగుతోందన్నారు. మొత్తం 1,85,348 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అర్హులుగా ఉన్నారని, అందులో 88,738 మంది పురుషులు, 96,572 మంది మహిళలు, 38 మంది ఇతరులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఉదయం 11 గంటల వరకు 54,298 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు.
పట్టణాల వారీగా పోలింగ్ శాతం ఇలా ఉంది:
అశ్వరావుపేట మున్సిపాలిటీ: 45.18%
16,850 మంది ఓటర్లలో 7,613 మంది ఓటు వినియోగం.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్: 28.46%
1,34,775 మంది ఓటర్లలో 38,362 మంది ఓటు వినియోగం.
యెల్లందు మున్సిపాలిటీ: 24.68%
33,723 మంది ఓటర్లలో 8,323 మంది ఓటు వినియోగం.
పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, షెడ్లు, వీల్‌చైర్లు వంటి మౌలిక వసతులు కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు సౌకర్యవంతంగా ఓటు వేయేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.
మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్లు స్వేచ్ఛాయుత, భయరహిత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి పిలుపునిచ్చారు.

Post a Comment