భద్రాచలంలో 15.070 కేజీల గంజాయి 10.73 లక్షల విలువైన గంజాయి, కారు స్వాధీనం
భద్రాచలం: భద్రాచలం RTA కార్యాలయం సమీపంలో ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ విభాగం భారీ గంజాయి రవాణాను అడ్డుకుంది. ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ CI CH. శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో కారులో అక్రమంగా తరలిస్తున్న 15.070 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
RTA ఆఫీసు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న TG 08 HQ 9088 నంబర్ గల కారును ఆపి పరిశీలించగా గంజాయి బయటపడింది. ఈ గంజాయి ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు నిందితుల విచారణలో వెల్లడైంది.
ఈ ఘటనలో
A1: రఘు విష్ణోయి (S/o గోవర్ధన్), జీడిమెట్ల, రంగారెడ్డి జిల్లా
A2: శేఖర్ రామ్ (S/o పోకర్ రామ్), జోధ్‌పూర్, రాజస్థాన్
అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి 15.070 కేజీల గంజాయి, ఒక కారు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని, మొత్తం రూ.10,73,500 విలువైన వస్తువులతో పాటు నిందితులను భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
ఈ తనిఖీల్లో కానిస్టేబుల్స్ సుధీర్, వెంకట్, హరీశ్, విజయ్ వీరబాబు, ఉపేందర్ పాల్గొన్నారు. గంజాయి పట్టివేతలో ప్రతిభ చూపిన సిబ్బందిని 05-02-2026 తేదీన ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ G. జనార్ధన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ G. గణేష్, ES K. తిరుపతి అభినందించారు.
నోట్: గంజాయికి సంబంధించిన ఏవైనా సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 2523 కు తెలియజేయవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని CI తెలిపారు.

Post a Comment