ఐడియల్ యూత్ మూవ్‌మెంట్ (I.Y.M) గోదావరిఖని యూనిట్ కార్యాలయం ప్రారంభం

ఐడియల్ యూత్ మూవ్‌మెంట్ (I.Y.M) గోదావరిఖని యూనిట్ కార్యాలయం ప్రారంభం


గోదావరిఖని, ఫిబ్రవరి 5 : ఐడియల్ యూత్ మూవ్‌మెంట్ (I.Y.M) గోదావరిఖని యూనిట్‌కు సంబంధించిన కొత్త కార్యాలయం గోదావరిఖని జామా మస్జిద్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమం ఖాజీ ముహమ్మద్ ఇస్మాయిల్ నిజామి, రామగుండం కార్పొరేషన్ మండల్ ఇన్‌చార్జ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా సయ్యద్ ఫకృద్దీన్ అలీ అహ్మద్, జమాత్ ఇ ఇస్లామీ హింద్ రాష్ట్ర కార్యదర్శి (మిల్లీ ఉమూర్) మరియు I.Y.M రాష్ట్ర కోఆర్డినేటర్ హాజరై, కొత్త కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంబించారు.

ఈ సందర్భంగా సయ్యద్ ఫకృద్దీన్ అలీ అహ్మద్ మాట్లాడుతూ, యువతను సన్మార్గం వైపు నడిపించడమే కాకుండా విజ్ఞానాభివృద్ధి, క్యారియర్ గైడెన్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ వంటి అంశాల్లో ఈ కార్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. యువత తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సయ్యద్ జావిద్ అక్మల్ హుస్సేని (అధ్యక్షుడు, సింగరేణి డి.వై.జి.ఎం), అబ్దుల్ రజాక్ (వైస్ ప్రెసిడెంట్ – I.Y.M), మజారుద్దీన్, ఫాజిల్ అహ్మద్ ఖాన్, రెహాజుద్దీన్, షరియత్ పంచాయతీ చైర్మన్ మరియు జామా మస్జిద్ అధ్యక్షుడు మహమ్మద్ ఫసియుద్దీన్వైస్ చైర్మన్ మహమ్మద్ ముస్తఫామక్సూద్ అహ్మద్ ఖాన్ (శిక్షణ కార్యదర్శి),ఫయాజ్ (కొనుగోలు సెల్ విభాగం), అక్బర్ (నజీమ్ ఇ హల్కా), ఖాజా మొయినుద్దీన్, అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొని తమ అభినందనలు తెలిపారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.