200 కోట్ల యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా గూడూరు గ్రామంలో నిర్వహించిన ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా నీలగిరి జిల్లా మహిళా సమాఖ్యకు రూ.1,138 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన పేర్కొన్నారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నబియ్యం పంపిణీ, పంటలకు బోనస్, ఉచిత విద్యుత్ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment