మహిళా న్యాయవాదిని ఆస్తి కోసం సుపారీ గ్యాంగ్‌తో చెల్లెలిని హతమార్చించిన అన్న

మహిళా న్యాయవాదిని ఆస్తి కోసం సుపారీ గ్యాంగ్‌తో చెల్లెలిని హతమార్చించిన అన్న


రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల: మహిళా న్యాయవాది స్వప్న హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి విషయమై తరచూ ఇబ్బంది పెడుతుందనే కారణంతో స్వప్నను ఆమె అన్నే సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

పోలీసుల వివరాల ప్రకారం, ఉదయం స్వప్న పొలానికి వెళ్లిన సమయంలో ముసుగులు ధరించిన దుండగులు కారులో వచ్చి ఆమెపై కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చారు. అనంతరం ఘటన స్థలాన్ని విడిచి పారిపోయారు.

ఈ ఘటన వెనుక ఆస్తి వివాదమే ప్రధాన కారణమని, స్వప్న అన్నే ముందుగా పథకం వేసి సుపారీ గ్యాంగ్‌ను నియమించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ హత్య కేసు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.