15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కూకట్‌పల్లి జోన్ ఎస్‌ఈ

 

15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కూకట్‌పల్లి జోన్ ఎస్‌ఈ

హైదరాబాద్, ఫిబ్రవరి 04: ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి అధికారి చిక్కారు. జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోన్‌కు చెందిన సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్‌ఈ) చిన్నారెడ్డి రూ.15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

బిల్లులు మంజూరు చేయాలంటే భారీగా లంచం ఇవ్వాలని ఓ కాంట్రాక్టర్‌ను చిన్నారెడ్డి డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనిపై బాధిత కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారు ముందస్తు ప్రణాళికతో వల వేసి పట్టుకున్నారు.

ఈ ఘటన అనంతరం జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. చిన్నారెడ్డికి సంబంధించిన పలు కీలక పత్రాలను పరిశీలించడంతో పాటు, ఆయన ఆస్తులు, ఆదాయ వనరులు తదితర అంశాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.