ఫిబ్రవరి 11న పోలింగ్ 13న ఫలితాలు 16న చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు, మేయర్, డిప్యూటీ మేయర్
మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది
హైదరాబాద్, ఫిబ్రవరి 3: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన దశ ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు మంగళవారం సాయంత్రం 3 గంటలతో ముగియడంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా ఖరారైంది.
రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఎన్నికలు బ్యాలెట్ విధానంలో నిర్వహించనున్నారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే ఫిబ్రవరి 12న చేపడతామని ఎన్నికల సంఘం తెలిపింది. ఫిబ్రవరి 13న ఫలితాలు ప్రకటించనుండగా, ఫిబ్రవరి 16న మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు, కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుని సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Post a Comment