రెండు కోట్ల ఐదు లక్షల విలువైన 408 కేజీల గంజాయి స్వాధీనం – నలుగురు అరెస్ట్

 

రెండు కోట్ల ఐదు లక్షల విలువైన 408 కేజీల గంజాయి స్వాధీనం – నలుగురు అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని Chunchupalli పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు చుంచుపల్లి పోలీసులు మరియు కొత్తగూడెం సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న RJ09GD0686 నంబరు గల టాటా కంపెనీ లారీని ఆపి తనిఖీ చేయగా, కంటైనర్‌లో కొబ్బరి పీచు బండిల్స్ మధ్య కవర్లు వేసి దాచిన 16 బ్యాగుల్లో మొత్తం 408.185 కిలోల నిషేధిత గంజాయి ఉన్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.2,04,09,250గా అంచనా వేశారు.

అటవీ ప్రాంతం నుంచి లోడ్ – రహస్య రవాణా

పట్టుబడిన నలుగురు నిందితులను విచారించగా, Chintoor నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో గంజాయిని కొబ్బరి పీచు బండిల్స్ మధ్య దాచిపెట్టి లారీలో లోడ్ చేసినట్లు వెల్లడైంది. అనంతరం అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో గంజాయి కొనుగోలు, అమ్మకాలతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

అరెస్టైన నిందితులు

సూర్యవంశీ సంతోష్ (29), మహారాష్ట్ర రాష్ట్రం బీడ్ జిల్లా

మహమ్మద్ ఉమర్ (29), ఉత్తరప్రదేశ్ రాష్ట్రం (లారీ డ్రైవర్)

దేబ్రత చక్రబర్తి (25), మల్కాన్గిరి జిల్లా

నరత్తం రాయ్ (25), ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లా

స్వాధీనం చేసుకున్న సొత్తు

408.185 కిలోల గంజాయి

RJ09GD0686 నంబరు గల టాటా లారీ

ఒక ద్విచక్ర వాహనం

నాలుగు సెల్‌ఫోన్లు

జిల్లాలో కొనసాగుతున్న కట్టుదిట్టమైన చర్యలు

జిల్లాలో 2025 జనవరి నుంచి ఇప్పటివరకు 84 కేసుల్లో రూ.33 కోట్ల 44 లక్షల విలువైన 6688 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి కేసులతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించగా, మరో ముగ్గురి ఆస్తులను జప్తు చేసినట్లు వెల్లడించారు. మరికొంతమందిపై కూడా పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు జాబితా సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ పట్టివేతలో కీలక పాత్ర పోషించిన కొత్తగూడెం సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు, చుంచుపల్లి ఎస్సైలు రవికుమార్, ఉమ మరియు సిబ్బందిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Blogger ఆధారితం.