జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం

 

జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ నగరంలోని హైదరాబాద్ లో కలకలం రేపిన అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ సమీపంలోని మంగలగిరి షాపింగ్ మాల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

సమాచారం ప్రకారం, మాల్‌లోని ఓ దుకాణంలో ఏర్పాటు చేసిన గోపురం డెకరేషన్‌కు మంటలు అంటుకోవడంతో అగ్నిప్రమాదం వేగంగా వ్యాపించింది. మంటలు ఎగసిపడడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మూడు ఫైరింజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

Blogger ఆధారితం.