60 లక్షలతో ఏటీఎం వాహన డ్రైవర్ పరార్
Gachibowli: ఏటీఎంలలో నగదు నింపేందుకు తీసుకొచ్చిన క్యాష్ వాహనంతో డ్రైవర్ పరారైన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. నిందితుడు తెల్లాపూర్‌లో వాహనం వదిలేసి దాదాపు రూ.60 లక్షల నగదుతో పరారయ్యాడు.
ఘటన వివరాలు
ఇన్‌స్పెక్టర్ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం, Sangam Security Solutions సంస్థ, Axis Bank ఏటీఎంలకు క్యాష్ మెయింటెనెన్స్ సర్వీస్ (CMS) నిర్వహిస్తోంది.
డ్రైవర్ బడిగేరీ అజిత్ కుమార్ అలియాస్ శివ, ఇద్దరు కస్టోడియన్లు ఎస్. రామకృష్ణ, ఎం.డి. మాలిక్, గార్డు పెరుమాల్‌తో కలిసి సీఎంఎస్ వాహనం (టీఎస్ 10 యూడీ 0393)లో ఏటీఎంలలో నగదు లోడ్ చేయడానికి బయలుదేరారు.
సాయంత్రం సుమారు 4:45 గంటలకు గోపన్‌పల్లిలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం వద్ద: ఇద్దరు కస్టోడియన్లు నగదు లోడ్ చేయడానికి లోపలికి వెళ్లారు. గార్డు వాష్‌రూమ్‌కు వెళ్లాడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న డ్రైవర్ అజిత్ కుమార్ వాహనంతో అక్కడి నుంచి పరారయ్యాడు
పోలీసుల చర్యలు
కస్టోడియన్లు బయటకు వచ్చేసరికి వాహనం కనిపించకపోవడంతో డ్రైవర్‌కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్‌లో ఉంది. వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చారు.
జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా వాహనం తెల్లాపూర్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. గద్దర్ చౌరస్తా సమీపంలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వాహనం వదిలివేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అందులో ఉన్న రూ.60 లక్షల నగదుతో నిందితుడు పరారయ్యాడు.
దర్యాప్తు కొనసాగుతోంది. వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌కు అంతర్గత సహాయం ఉందా అనే కోణంలో విచారణ, ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి

Post a Comment