నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ

 

నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ

పాల్వంచలో నవ లిమిటెడ్ నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. తాటి ఆకులతో తయారు చేసిన కళాకృతుల విక్రయం ద్వారా సమకూరిన రూ.87,641 నగదును మహిళలకు చెక్కు రూపంలో అందజేశారు.

ఈ చెక్కులను నవ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ & కంపెనీ సెక్రటరీ వి.ఎస్.ఎన్. రాజు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బి. శ్రీనివాసరావు మహిళలకు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం మాత్రమే కాకుండా సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండి తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. మహిళ సాధికారతే సమాజ ప్రగతికి బాటవేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ‘ఆముద’ ప్రతినిధులు, విద్యార్థులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.