పాల్వంచలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు సన్మానం
పాల్వంచ: ఇటీవల నిర్వహించిన కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఎం అభ్యర్థి విజయం సాధించేందుకు కృషి చేసిన నాగా సీతారాములు గారిని ఘనంగా సన్మానించారు.
పాల్వంచ 8వ డివిజన్‌కు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ కొక్కుల వెంకటేశ్వర్లు దంపతులు, అలాగే సిరిపురపు లలిత దంపతులు, 45వ డివిజన్‌కు చెందిన దంతెబోయిన నరేష్ దంపతులు కలిసి శాలువా, పూలమాలలతో సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి నాగా సీతారాములు చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు కార్యకర్తలకు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు.
సన్మానానికి స్పందించిన నాగా సీతారాములు, పార్టీ విజయం కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకూ కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.

Post a Comment