మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసిన గుమ్మడి నరసయ్య
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలోని మంత్రి నివాసంలో ఈ భేటీ జరిగింది. ఇరువురు నేతలు ఆత్మీయంగా చర్చించుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థితులతో పాటు పలు ప్రజా సమస్యలపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
నిరాడంబర రాజకీయ నాయకుడిగా పేరుగాంచిన గుమ్మడి నరసయ్య, మంత్రి నివాసానికి రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో ఫోట్రు రంగారావు, పైడి వెంకటేశ్వరరావు, కె.వి. సత్యనారాయణ, కాసాని నాగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment