చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్.. పలు వాహనాలు ధ్వంసం!
ముంబై నగరంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని ముల్లుంద్ వెస్ట్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెట్రో స్టేషన్‌కు సంబంధించిన పిల్లర్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై పిల్లర్ కూలడంతో పలు కార్లు, ఆటోలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మరియు ముంబై మెట్రో అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి రోడ్డుపై ట్రాఫిక్‌ను మళ్లించారు.
పిల్లర్ ఎందుకు కూలిందన్న అంశంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిర్మాణ నాణ్యతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment