వరంగల్‌లో మెడికోస్ కాన్ఫరెన్స్ – భారీగా తరలిన మెడికోలు

వరంగల్‌లో మెడికోస్ కాన్ఫరెన్స్ – భారీగా తరలిన మెడికోలు


వరంగల్: డాక్టర్స్ అసోసియేషన్ ఫర్ రిలీఫ్ అండ్ ఎడ్యుకేషన్ (DARE), అలాగే Initiative of Medicos for Service and Academics (IMSA) ఆధ్వర్యంలో వరంగల్ నగరంలో మెడికోస్ కాన్ఫరెన్స్ ఘనంగా నిర్వహించబడింది. సేవా దృక్పథంతో పాటు విద్యా అభివృద్ధే లక్ష్యంగా ఈ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేసినట్లు రామగుండం కార్పొరేషన్ మండల ఇన్‌చార్జి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ తెలిపారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వైద్య విద్యార్థులు, యువ వైద్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 8 ఇంక్లైన్ కాలనీ అంబేద్కర్ విగ్రహం సమీపంలోని SIMS – సింగరేణి వైద్య శాస్త్రాల సంస్థ (సిమ్స్) వద్ద నుంచి మెడికోలు భారీ ర్యాలీగా తరలివచ్చారు.

ఈ సందర్భంగా ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ మాట్లాడుతూ, వైద్య రంగంలో సేవాభావంతో పాటు అకాడమిక్ నైపుణ్యాలు పెంపొందించుకోవడం ఎంతో అవసరమని అన్నారు. సమాజానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో మెడికోలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో జమాత్ ఇ ఇస్లామీ హింద్ టెమ్రీస్ కౌన్సిలర్, హింద్ మజ్దూర్ సభ (HMS) జాతీయ కార్యదర్శి సయ్యద్ జావిద్ అక్మల్ హుస్సేనీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అలాగే గోదావరిఖని యూనిట్ అధ్యక్షురాలు శ్రీమతి ఐషా సిద్ధిఖ, మహిళా విభాగం టెమ్రీస్ కౌన్సిలర్‌గా పాల్గొన్నారు.

8 ఇంక్లైన్ కాలనీ ఇన్‌చార్జ్‌గా ఉన్న నిర్వాహకులు అతిథులను ఘనంగా స్వాగతించి, కాన్ఫరెన్స్ విజయవంతంగా నిర్వహించినందుకు పాల్గొన్న మెడికోలను అభినందించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.