ఎఫ్‌డీసీ జామాయిల్ తోటల హార్వెస్టింగ్ పనుల్లో భారీ లంచం కేసు డివిజనల్ మేనేజర్ తాటి శ్రీ శ్రావణి అరెస్ట్

 

ఎఫ్‌డీసీ జామాయిల్ తోటల హార్వెస్టింగ్ పనుల్లో భారీ లంచం కేసు డివిజనల్ మేనేజర్ తాటి శ్రీ శ్రావణి అరెస్ట్

ఖమ్మం / కొత్తగూడెం: ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) కొత్తగూడెం డివిజన్ పరిధిలో జామాయిల్ తోటల హార్వెస్టింగ్ పనులకు సంబంధించి భారీ లంచం డిమాండ్ కేసులో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు కీలక అరెస్టులు చేశారు.

ఫిర్యాదుదారుడికి లభించిన టెండర్‌కు సంబంధించిన యూనిట్ నంబర్లు 8 నుండి 15 వరకు మొత్తం 32,000 టన్నుల యూకలిప్టస్ చెట్ల నరికివేత పనులకు, ఒక్క టన్నుకు రూ.90 చొప్పున మొత్తం రూ.28.80 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి.

ఈ క్రమంలో, పెనగడప గ్రామ శివార్లలోని యూనిట్ నెం.9కు సంబంధించిన 3,900 టన్నుల యూకలిప్టస్ చెట్ల నరికివేత పనుల భవిష్యత్తు బిల్లుల ఆమోదం కోసం, ఒక్క టన్నుకు రూ.90 చొప్పున రూ.3,51,000 లంచం తీసుకుంటున్న సమయంలో ప్లాంట్ మేనేజర్ రాజేందర్ మరియు అతనికి సహకరించిన **గోపాలకృష్ణ (సీతాయిగూడెం నివాసి)**లను ACB అధికారులు 03-01-2026 నాడు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితురాలైన డివిజనల్ మేనేజర్ తాటి శ్రీ శ్రావణి అప్పటి నుంచి పరారీలో ఉండగా, నమ్మదగిన సమాచారం మేరకు విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ వద్ద ఆమెను గుర్తించిన ACB అధికారులు ఈరోజు ఆమెను అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేశారు. ఈ కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని ACB అధికారులు తెలిపారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ACB ఖమ్మం రేంజ్, ఖమ్మం

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.