మాట్వాడ ఈద్గా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం 1 కోటి మంత్రి కొండా సురేఖ
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. 11వ డివిజన్ పరిధిలోని పోతన నగర్ రోడ్డులో ఉన్న మాట్వాడ ఈద్గా అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.1 కోటి వ్యయంతో చేపట్టనున్న పనులకు మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
మాట్వాడ ఈద్గా వద్ద భక్తులకు మరియు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ఈ పనులు చేపట్టుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ఆ ప్రాంత ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
అనంతరం ఎంజీఎం జంక్షన్ వద్ద రూ.35 లక్షల వ్యయంతో నిర్మించిన శిశు సంరక్షణ ప్రతిమను మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నగర సౌందర్యవృద్ధి మరియు సామాజిక చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

Post a Comment