PM Vishwakarma Yojanaను వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలి

PM Vishwakarma Yojanaను వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలి


కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM Vishwakarma Yojanaను వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి సూచించారు. శనివారం రుద్రంపూర్ సీఈఆర్ క్లబ్‌లో పథకంపై అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన PM Vishwakarma Yojana, Prime Minister's Employment Generation Programme (పీఎం ఈజీపీ) వంటి పథకాలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, నిరుద్యోగ యువతకు, సంప్రదాయ చేతివృత్తులపై ఆధారపడిన వారికి ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. ఈ పథకాల ద్వారా తక్కువ వడ్డీ రుణాలు, సబ్సిడీలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఆధునిక పరికరాల కొనుగోలుకు ఆర్థిక సహాయం అందుతుందని వివరించారు.

పథకాలకు దరఖాస్తు చేసే విధానం, అర్హత ప్రమాణాలు, అందించే సబ్సిడీ శాతం, అలాగే అర్హులైన వృత్తుల వివరాలను సమగ్రంగా వివరించారు. అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి సమయానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అనంతరం India Post Payments Bank (ఐపీపీబీ) మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ బ్యాంకు రుణాలపై సమగ్ర సమాచారం అందించారు. రుణం పొందేందుకు అవసరమైన పత్రాలు, అర్హతలు, దరఖాస్తు విధానం, లబ్ధిదారులు పాటించాల్సిన నిబంధనలను వివరించారు.

కార్యక్రమంలో భాగంగా పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు ఐపీపీబీ ఖాతాలను ప్రారంభించి, ఆన్‌లైన్ మర్చంట్ స్టికర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫెసిలిటేషన్ ఆఫీసర్ (ఎంఎస్‌ఎంఈ) దినేష్ కుమార్, ర్యాంప్ ఈడీసీ మేనేజర్ వసంత తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.