మహిళా దినోత్సవం సందర్భంగా కవయిత్రి మంజుల సందేశం

మహిళా దినోత్సవం సందర్భంగా కవయిత్రి మంజుల సందేశం


యాదాద్రి భువనగిరి జిల్లా: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా కవయిత్రి  మంజుల పత్తిపాటి మహిళల శక్తి, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక సందేశాన్ని అందించారు. మహిళలు ఎదుర్కొనే కష్టాలు, అవమానాలు, అడ్డంకులను అధిగమించి విజయాన్ని సాధించే శక్తి తమలోనే ఉందని ఆమె తన కవిత ద్వారా వ్యక్తం చేశారు.

“గాయాల్ని గుండెల్లో దాచుకుని గర్వంగా నవ్వడం నేర్చుకున్నాను… పడిపోతూ కూడా నిలబడటం నేర్చుకున్నాను” అంటూ ప్రారంభమైన ఈ కవితలో మహిళల సహనం, ధైర్యం, సంకల్పబలం స్పష్టంగా ప్రతిఫలించాయి. సమాజంలో మహిళలను అబలగా చూడకుండా, మార్పుకు దారి చూపే నాయకులుగా గుర్తించాలని ఆమె సూచించారు.

ఇల్లు నుంచి దేశం వరకు ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటూ సమాజ అభివృద్ధికి తోడ్పడుతున్నారని పేర్కొంటూ, అన్ని రంగాల్లో రాణిస్తున్న ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

 మంజుల పత్తిపాటి ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్‌గా సేవలందించారు.

— TA9 vanita Desk

Blogger ఆధారితం.