మణుగూరు ఏరియాలో HMS యూనియన్‌లో భారీ చేరికలు

మణుగూరు ఏరియాకు HMS నూతన బ్రాంచ్ కమిటీని కూడా ఎన్నుకున్నారు


మణుగూరు, మార్చి 05:  మణుగూరు ఏరియా HMS యూనియన్ కార్యాలయంలో HMS రాష్ట్ర అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రియాజ్ అహ్మద్ సమక్షంలో యూనియన్‌లో భారీగా చేరికలు జరిగాయి. యూనియన్ కండువాలు కప్పి కొత్త సభ్యులను రియాజ్ అహ్మద్ యూనియన్‌లోకి ఆహ్వానించారు.

యూనియన్‌లో చేరిన వారిలో రామదాసు (EP ఆపరేటర్ PKOC2), ఆర్. ఎల్లయ్య (EP ఆపరేటర్ PKOC2), శ్రీనివాస్ (EP ఆపరేటర్), సంతోష్ (EP ఆపరేటర్ PKOC2), శ్రీనివాస్ రెడ్డి (EP ఆపరేటర్ PKOC2), పి. రమేష్ (ఎలక్ట్రీషియన్ OCP-IV), రామకృష్ణ (ఎలక్ట్రీషియన్ OCP-IV) ఉన్నారు.

ఈ సందర్భంగా మణుగూరు ఏరియాకు నూతన బ్రాంచ్ కమిటీని కూడా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మణుగూరు ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోడిపల్లి శ్రీలత, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్, బ్రాంచ్ సెక్రటరీ దరిసా రమేష్, సెంట్రల్ నాయకులు రకీబ్, సంజీవ్, సయ్యద్ షబ్బీర్ పాషా మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.