విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కలెక్టర్ సీరియస్… నలుగురు సస్పెండ్

విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కలెక్టర్ సీరియస్… నలుగురు సస్పెండ్


నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య ఘటనపై జిల్లా కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రాథమిక విచారణకు ఆదేశాలు ఇచ్చారు.

గిరిజన సంక్షేమ గురుకులాల ఆర్సీవో గంగారాం నేతృత్వంలో ఇతర ఏకలవ్య పాఠశాలల ప్రిన్సిపాళ్లు శ్రీనివాస్ స్వామి, డా. సైదా జైనబ్, ఫణి కుమార్, డా. జ్యోతి సభ్యులుగా బృందం ఏర్పాటైంది. ఈ బృందం ఘటనపై ప్రాథమిక విచారణ నిర్వహించి నివేదికను కలెక్టర్‌కు అందించింది.

బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా పాఠశాల ప్రిన్సిపల్ రమేష్ కుమార్‌తో పాటు హౌస్ మాస్టర్ కుల్దీప్ యాదవ్, వార్డెన్ విశ్వంబర్, మెస్ ఇన్‌ఛార్జ్ ఆకాష్ యాదవ్‌లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం కలెక్టర్ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని, చెడు ఆలోచనలు చేయకూడదని విద్యార్థులకు సూచించారు. ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చొద్దని కోరారు.

Blogger ఆధారితం.