తూప్రాన్ గాంధీనగర్‌లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

తూప్రాన్ గాంధీనగర్‌లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం


తూప్రాన్, మార్చ్ 4: తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని తూప్రాన్ ఎస్ఐ గంగరాజు నిర్వహించారు. ఆన్‌లైన్ భద్రత, సైబర్ ముప్పులు మరియు వాటి నివారణ చర్యలపై స్థానికులకు వివరించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ గంగరాజు మాట్లాడుతూ, ప్రతి నెల మొదటి బుధవారం “సైబర్ జాగృతి దివాస్” కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిషింగ్, సైబర్ మోసాలు, పాస్‌వర్డ్ భద్రత, సోషల్ మీడియా సురక్షిత వినియోగం, సురక్షిత డిజిటల్ లావాదేవీల గురించి ప్రజలకు అవగాహన కల్పించామని చెప్పారు.

లావాదేవీలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత మరియు బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు లేదా ఆన్‌లైన్ లింకులు వచ్చినప్పుడు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. డిజిటల్ వేదికలను సురక్షితంగా మరియు బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని ప్రజలను ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఐ గంగరాజుతో పాటు ఎస్ఐ–2 యాదగిరి, తూప్రాన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.