సింగరేణి సీఎండీ డా. జ్యోతి బుద్ధ ప్రకాష్‌ను కలిసిన జిల్లా కలెక్టర్ అంకిత్
కొత్తగూడెం, మార్చి 7: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ శనివారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) సీఎండీ డా. జ్యోతి బుద్ధ ప్రకాష్, ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, పరస్పర సహకారంతో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఇద్దరూ చర్చించారు. జిల్లాలో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల అమలులో సింగరేణి సంస్థతో సమన్వయం కొనసాగించాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌తో పాటు శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మ కూడా పాల్గొన్నారు.

Post a Comment