ఖమ్మంలో టీచర్‌పై దాడి.. బాలికలతో అసభ్య ప్రవర్తన ఆరోపణలు
Khammam: ఖమ్మం నగరంలోని ఖాజీపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలతో హిందీ ఉపాధ్యాయుడు అర్షద్ పాషాపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.
సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment