నవ మహిళ సాధికార కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

నవ మహిళ సాధికార కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు


పాల్వంచ: స్థానిక నవ లిమిటెడ్‌ పాల్వంచ సంస్థ తన సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన నవ మహిళ సాధికార కేంద్రంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా తాటాకుల కళాకృతుల శిక్షకురాలు అమ్ముద తన అనుభవాలను మహిళలతో పంచుకుని, స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థికంగా ఎలా ముందుకు వెళ్లగలరో వివరించారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథి సునీత మాట్లాడుతూ మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో సాధించిన విజయాలను గుర్తించి గౌరవించేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారత కోసం నవ లిమిటెడ్ చేపడుతున్న కార్యక్రమాలను ఆమె ప్రశంసించారు.

అదేవిధంగా ఎస్‌బీఐ క్యాషియర్ సింధు మాట్లాడుతూ నవ మహిళా సాధికార కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాలను మహిళలు వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా అతిథులను ఘనంగా సన్మానించారు. అనంతరం మహిళా సాధికార కేంద్రంలో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీమతి సింధు (హెచ్‌ఆర్‌), కళ్యాణి (డిప్యూటీ మేనేజర్‌, ఎస్‌బీఐ), మహిళా సాధికార కేంద్ర సిబ్బంది టీ. అరుణ, అమ్ముద, అరుణ, కవిత, దివ్యతో పాటు వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.