నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె జేఏసీ నాయకులు

నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె జేఏసీ నాయకులు


హైదరాబాద్, ఏప్రిల్ 21: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం రేపటి (ఏప్రిల్ 22) అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభించనున్నట్లు టీఎస్ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రకటించారు.

సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు గడిచినా ప్రభుత్వం చర్చలకు ముందుకు రాకపోవడం పట్ల జేఏసీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాలు సమ్మెకు మద్దతు తెలిపాయని తెలిపారు.

ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మాట్లాడుతూ, ఇప్పటివరకు ప్రభుత్వం లేదా ఆర్టీసీ అధికారులు చర్చలకు పిలవలేదని, సమ్మె నివారణకు కూడా చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కాలేదని, కాలయాపన కోసం మాత్రమే కమిటీని ఏర్పాటు చేశారని ఆరోపించారు. మెట్రోను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం, ఆర్టీసీ సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.

ఇక హైదరాబాదులో ఆర్టీసీని బలహీనపర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆర్టీసీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ సమ్మె మరింత విస్తరించి “సకల జనుల సమ్మె”గా మారే అవకాశం ఉందని జేఏసీ నాయకులు హెచ్చరించారు.

Blogger ఆధారితం.