రోడ్డు ప్రమాదాల నివారణకు గోల్డెన్ అవర్ కీలకం: డీఎంహెచ్‌ఓ డా. తుకారాం రాథోడ్
కొత్తగూడెం: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక–99 రోజుల కార్యక్రమం మరియు రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ వీక్ (ఎరైవ్ అవేర్‌నెస్ కార్యక్రమం)లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ కొత్తగూడెం ఆర్‌టిఓ కార్యాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తొలి గంటలో అందించే వైద్య సహాయం అయిన “గోల్డెన్ అవర్” ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే సరైన చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ఆయన తెలిపారు.
అలాగే డ్రైవర్లు మరియు సాధారణ ప్రజలకు సీపీఆర్ (Cardio Pulmonary Resuscitation) పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి, ప్రాక్టికల్ డెమో ద్వారా శ్వాస ఆగిన వ్యక్తికి ఎలా సహాయం చేయాలో వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ అందించడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రతాప్ (ప్రోగ్రామ్ ఆఫీసర్, ఎంహెచ్‌ఎన్), డాక్టర్ సుందర్ (ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్) మరియు ఆర్‌టిఓ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రమాద సమయంలో తక్షణ స్పందన, ప్రాణరక్షణ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా అధికారులు తెలిపారు.

Post a Comment