హజరత్ వలి బాబా ఉర్సు మహోత్సవంలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు

 

హజరత్ వలి బాబా ఉర్సు మహోత్సవంలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు

చాతకొండ, ఏప్రిల్ 9: లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ గ్రామంలో హజరత్ వలి బాబా (ర.అ) 34వ ఉర్సు మహోత్సవాన్ని దర్గా కమిటీ వారు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన బాబా గారి గంధం, ఫాతిహ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ వలి బాబా గారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కుల, మత భేదాలు లేకుండా ప్రజలు దర్గా ఉత్సవాల్లో పాల్గొని తమ భక్తిని చాటుకోవడం ఆనందదాయకమని తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికీ బాబా ఆశీస్సులు లభించాలని కోరారు.

ఈ సందర్భంగా కొత్తగూడెం టౌన్ మైనారిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.డి. ఖాదర్, నాగ సీతారాములను ఘనంగా సన్మానించారు. ఈ ఉర్సు మహోత్సవంలో దర్గా నిర్వాహకులు, మైనారిటీ నాయకులు, భక్తులు, యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Blogger ఆధారితం.