భద్రాద్రి 23వ డివిజన్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం

 

డివిజన్ కమిటీ నియామకం – గెలుపే లక్ష్యంగా పని చేద్దాం: నాగా సీతారాములు

కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 23వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు డివిజన్ కమిటీల నియామక ప్రక్రియలో భాగంగా ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, కమిటీ సభ్యులు క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీ పురోగతికి కృషి చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతరావు, 28వ డివిజన్ కార్పొరేటర్ శ్రీలక్ష్మీ, 25వ డివిజన్ కార్పొరేటర్ కేకే, కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, చింతలపూడి రాజశేఖర్, బత్తుల వీరయ్యతో పాటు 23వ డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.