మహబూబాబాద్ జిల్లా TRS ఇంచార్జ్‌గా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ నియామకం

మహబూబాబాద్ జిల్లా TRS ఇంచార్జ్‌గా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ నియామకం


తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న జెండా పండుగ కార్యక్రమాల కోసం జిల్లా, నియోజకవర్గ ఇంచార్జీలను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత నిన్న ప్రకటించారు.

ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా పార్టీ TRS ఇంచార్జ్‌గా ఇనుగుర్తి మండలం చిన్న నాగారం గ్రామానికి చెందిన డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను నియమించారు. జాగృతి సంస్థ ద్వారా కష్టకాలంలో కూడా కవితకు అండగా నిలిచిన శ్రీకాంత్ గౌడ్ విధేయతను గుర్తించి, మానుకోట జిల్లా బాధ్యతలను అప్పగించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

అలాగే మానుకోట నియోజకవర్గ ఇంచార్జ్‌గా సీనియర్ నాయకుడు గంధసిరి వేణును, డోర్నకల్ నియోజకవర్గ ఇంచార్జ్‌గా బోడ అనిల్ నాయక్‌ను నియమించారు.

రాష్ట్ర, జిల్లా బాధ్యుల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో TRS జెండా ఎగిరేలా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.

తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు కల్వకుంట్ల కవితకు నూతన ఇంచార్జీలు కృతజ్ఞతలు తెలిపారు.

Blogger ఆధారితం.