తెలంగాణ రక్షణ సేన జెండా పండుగకు ఇన్‌ఛార్జీల నియామకం

తెలంగాణ రక్షణ సేన జెండా పండుగకు ఇన్‌ఛార్జీల నియామకం


కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలోని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా పండుగ కార్యక్రమం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల వరకు రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 33 జిల్లాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు జిల్లా ఇన్‌ఛార్జీలు, స్టేట్ అబ్జర్వర్లను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత నియమించారు. నెల రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమాలను జిల్లా ఇన్‌ఛార్జీలు, స్టేట్ అబ్జర్వర్లు సమన్వయం చేస్తూ పర్యవేక్షించనున్నారు.

జిల్లాల వారీగా ఇన్‌ఛార్జీలు – స్టేట్ అబ్జర్వర్లు

  • తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు రంగు నవీన్ ఆచారి జిల్లా ఇన్‌ఛార్జ్‌గా, కరిమిల్ల బాబు రావు స్టేట్ అబ్జర్వర్‌గా నియమితులయ్యారు.
  • కామారెడ్డి జిల్లాకు ఆదురుగట్ల సంపత్ గౌడ్, కోల శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టనున్నారు.
  • ఆదిలాబాద్ జిల్లాకు రంగినేని శ్రీనివాస్ రావు జిల్లా ఇన్‌ఛార్జ్‌గా, మేకల లలిత యాదవ్ స్టేట్ అబ్జర్వర్‌గా వ్యవహరించనున్నారు.
  • నిర్మల్ జిల్లాకు జుట్టు చంద్రశేఖర్, మంథని నవీన్ రెడ్డి నియమితులయ్యారు.
  • కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు వినోద్ కరిమిల్ల, బాబురావు రాథోడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
  • మంచిర్యాల జిల్లాకు ఉదారి చంద్ర మోహన్ గౌడ్, వరలక్ష్మి మంచాల నియమితులయ్యారు.
  • కరీంనగర్ జిల్లాకు చందా లక్ష్మీనారాయణ గుప్తా, కందాడి మణిపాల్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు.
  • మెదక్ జిల్లాకు పాండ్ల చంద్రశేఖర్, అప్పాల నరేందర్ యాదవ్ నియమితులయ్యారు.
  • నల్గొండ జిల్లాకు పడిగపాటి విక్రాంత్ రెడ్డి, దేవేందర్ రెడ్డి కుందురు నియమితులయ్యారు.
  • సూర్యాపేట జిల్లాకు కేఎల్‌ఎన్ రావు, విజయ్ గరినే బాధ్యతలు నిర్వహించనున్నారు.
  • సిద్దిపేట జిల్లాకు కొట్టాల యాదగిరి, లోక రవిచంద్ర నియమితులయ్యారు.
  • సంగారెడ్డి జిల్లాకు మసన్నగారి బాలయ్య జిల్లా ఇన్‌ఛార్జ్‌గా, నెల్లోజు శల్వచారి, దేశోజు సందీప్ స్టేట్ అబ్జర్వర్లుగా నియమితులయ్యారు.
  • రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఎండి మజీద్ అబ్దుల్, కొంగరి ధరణి రాణి బాధ్యతలు చేపట్టనున్నారు.
  • పెద్దపల్లి జిల్లాకు కొమురయ్య సలేంద్ర, ఎల్ వెంకటేష్ జిల్లా ఇన్‌ఛార్జీలుగా, పొన్నమనేని బాలాజీ రావు స్టేట్ అబ్జర్వర్‌గా నియమితులయ్యారు.
  • వరంగల్ & హన్మకొండ జిల్లాలకు నడిపెల్లి వెంకటేశ్వర రావు, సయ్యద్ ఇస్మాయిల్ నియమితులయ్యారు.
  • జగిత్యాల జిల్లాకు చెర్లపల్లి అమర్‌దీప్ గౌడ్, మాధవి మరిపెల్లి బాధ్యతలు చేపట్టనున్నారు.
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు కుషన నరేష్ నేత, మెడల అభిలాష్ గౌడ్ నియమితులయ్యారు.
  • మహబూబాబాద్ జిల్లాకు శ్రీకాంత్ గౌడ్ నలమాస, కిషన్ నాయక్ బానోత్ బాధ్యతలు నిర్వహించనున్నారు.
  • జనగామ జిల్లాకు చిలుక ప్రవీణ్, కలబ్‌గూర్ దయాకర్ రెడ్డి నియమితులయ్యారు.
  • ములుగు జిల్లాకు నంగవత్ రాజేష్ నాయక్, మెడల అభిలాష్ గౌడ్ నియమితులయ్యారు.
  • ఖమ్మం జిల్లాకు గట్టు కరుణ, చలసాని విష్ణుమూర్తి నియమితులయ్యారు.
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు దేవళ్ల వీరన్న, రియాజ్ అహ్మద్ బాధ్యతలు చేపట్టనున్నారు.
  • యాదాద్రి భువనగిరి జిల్లాకు చందుపట్ల సుజిత్ రావు, పవన్ రావు పోనుగోటి నియమితులయ్యారు.
  • మహబూబ్‌నగర్ జిల్లాకు మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్, గుంజపడుగు హరిప్రసాద్ నియమితులయ్యారు.
  • నాగర్‌కర్నూల్ జిల్లాకు పోనుగోటి శ్రీపతి రావు, సురేందర్ జీ హకీంకరి బాధ్యతలు చేపట్టనున్నారు.
  • వనపర్తి జిల్లాకు కందుర్ మాలతి రెడ్డి, కోట్ల మహేందర్ రెడ్డి నియమితులయ్యారు.
  • నారాయణపేట జిల్లాకు గావినోళ్ల శ్రీనివాస్, పుల్లూరి శ్రీనివాస్ రావు బాధ్యతలు నిర్వహించనున్నారు.
  • జోగులాంబ గద్వాల జిల్లాకు గొంగళ్ల రంజిత్ కుమార్, ఆర్వీఆర్ ప్రసాద్ నియమితులయ్యారు.
  • రంగారెడ్డి జిల్లాకు నరేష్ ప్రజాపతి, తాండ్ర శ్రీనివాస్ రావు బాధ్యతలు చేపట్టనున్నారు.
  • వికారాబాద్ జిల్లాకు కోల శ్రీనివాస్, లకావత్ రూప్ సింగ్ నియమితులయ్యారు.
  • మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు రామిడి వెంకట్ రెడ్డి జిల్లా ఇన్‌ఛార్జ్‌గా, రంగు నవీన్ ఆచారి, కిషోర్ తానింటి స్టేట్ అబ్జర్వర్లుగా నియమితులయ్యారు.
  • హైదరాబాద్ జిల్లాకు భగవతుల సాయి మహేష్, ఎండి అబ్దుల్ సలీమ్ బాధ్యతలు నిర్వహించనున్నారు.
  • సికింద్రాబాద్ జిల్లాకు విజయ్ గరినే జిల్లా ఇన్‌చార్జ్‌గా, డేవిడ్ గజ్జి స్టేట్ అబ్జర్వర్‌గా నియమితులయ్యారు.
Blogger ఆధారితం.