తలంగాణ వచ్చే 24 గంటల్లో పలు జిల్లాల్లో వడగాల్పుల హెచ్చరిక
హైదరాబాద్, మే 25: తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGiCCC) రాష్ట్ర ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా తీవ్ర వడగాల్పులు (హీట్ వేవ్) వీచే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది.
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వడగాల్పుల పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావొద్దని సూచించారు.
ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని, తగినంత నీరు తాగుతూ శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలని సూచించారు. రైతులు, కూలీలు, బయట పనిచేసే వారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Post a Comment