29వ వార్డులో నూతన బోర్ ప్రారంభం.. ప్రజలకు తాగునీటి సౌకర్యం

 

29వ వార్డులో నూతన బోర్ ప్రారంభం.. ప్రజలకు తాగునీటి సౌకర్యం

కొత్తగూడెం టౌన్‌లోని 29వ డివిజన్ పరిధిలో గల న్యూ గొల్లగూడెంలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు కొనసాగుతున్నాయి. డా. అలీబాబా ఇంటి ముందు డివిజన్ కార్పొరేటర్ మల్హోత్రా సాగర్ ఆధ్వర్యంలో నూతన బోర్‌వెల్ పనులను ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రజలకు అత్యవసరమైన తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని డివిజన్‌లో ఇప్పటికే రెండు బోర్లు ఏర్పాటు చేయగా, తాజాగా మూడో బోర్‌ను విజయవంతంగా వేయించడం జరిగింది.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కార్పొరేటర్ మల్హోత్రా సాగర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందించడంలో ఆయన ముందుండి పనిచేస్తున్నారని కొనియాడారు.

బోర్ పనులను డివిజన్ పెద్దలు, మాజీ స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు, షేక్ జానీ, ఎత్తు సమ్మయ్య, పాసికంటి రమేష్, బొమ్మిసెట్టి కిరణ్, రామాచారి, టెంట్ హౌస్ ప్రకాష్, మారపల్లి రవి, నీలం పుల్లయ్య, బుధారపు శ్రీను, బుధారపు వెంకన్న తదితరులు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో BRS కార్యకర్తలు మల్హోత్రా కుమార్, వేముల పవన్, లేతాకుల నాగరాజు, సాగంటి రవి, చింతల రాము, రేగుల రాజేష్, లగిశెట్టి ప్రసాద్, గుడిసె శ్రావణ్, బుధారపు చరణ్, మహమ్మద్ జఫ్ఫు, గుర్రాల సాయి, వెలిశాల పవన్‌తో పాటు డివిజన్ మహిళలు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.