లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం
కొత్తగూడెం పట్టణంలో సేవా కార్యక్రమాలకు చిరునామాగా నిలుస్తున్న Lions Club of కొత్తగూడెం మిలీనియం ఆధ్వర్యంలో మరో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. క్లబ్ ప్రెసిడెంట్ లయన్ బొక్క శ్రీనివాస్ దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హెడాఫీస్ ఎదురుగా ఉన్న శ్రీ జ్యోతి హృద్దుల శరణాలయం లో ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు, నిరాశ్రయులకు ప్రేమతో భోజనాలను వడ్డించి వారి ఆశీర్వాదాలు అందుకున్నారు. సమాజ సేవే లక్ష్యంగా లయన్స్ క్లబ్ సభ్యులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆశ్రమ నిర్వాహకులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ బొక్క శ్రీనివాస్‌తో పాటు లయన్ రాయల శాంతయ్య, లయన్ జేబీ మోహన్, లయన్ మండల రాజేశ్వరరావు, లయన్ గోవర్ధన్, లయన్ శరత్ మరియు ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. సేవా భావంతో నిర్వహించిన ఈ కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు అందుకుంది.

Post a Comment