కొత్తగూడెం మిల్లినియం లయన్స్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందిన లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిల్లినియం 2026-27 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ మేరకు నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో సభ్యుల సమక్షంలో కమిటీని ప్రకటించారు.
సమావేశంలో అధ్యక్షుడిగా లయన్ బాబురావు, కార్యదర్శిగా లయన్ పగడాల నగేష్, కోశాధికారిగా లయన్ గోవర్ధన్ ఎన్నికయ్యారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలపడంతో కొత్త కమిటీ బాధ్యతలు స్వీకరించింది.
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను క్లబ్ ప్రతినిధులు, సీనియర్ సభ్యులు అభినందించారు. రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలను మరింత విస్తరించి సమాజానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
నూతన అధ్యక్షుడు బాబురావు మాట్లాడుతూ విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, పేదలకు సహాయం వంటి సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, ప్రముఖులు, సేవా కార్యకర్తలు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

Post a Comment