ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావుకు ఘన సత్కారం
తక్కెళ్ళపల్లి రవీందర్రావుకు ఉర్దూ ఘర్ మాజీ చైర్మన్ అన్వర్ పాషా, 57వ డివిజన్ మైనారిటీ సీనియర్ నాయకులు సయ్యద్ జానీ శాలువాతో ఘనంగా సత్కరించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్ అయిన ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు పిలుపునిచ్చారు.
జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ భవన్‌లో నిర్వహించిన పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు అవగాహన సదస్సు నిమిత్తం జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్సీని ఉర్దూ ఘర్ మాజీ చైర్మన్ అన్వర్ పాషా, మైనారిటీ సీనియర్ నాయకుడు సయ్యద్ జానీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలోపేతం, మైనారిటీల సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై ఎమ్మెల్సీతో వారు చర్చించారు. పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ సూచించారు.

Post a Comment