ఎస్‌.ఐ.ఆర్ మ్యాపింగ్‌కు హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలి : మొహీద్ పటేల్

ఎస్‌.ఐ.ఆర్ మ్యాపింగ్‌కు హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలి : మొహీద్ పటేల్


నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ప్రీ ఎస్‌.ఐ.ఆర్ మ్యాపింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని ఎంఐఎం నారాయణఖేడ్ అధ్యక్షుడు, న్యాయవాది మొహీద్ పటేల్ కోరారు.

శుక్రవారం సబ్ కలెక్టర్ ఐఏఎస్ ఎన్. ఉమా హారతి గారిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ప్రతి ఓటరుకు ఎస్‌.ఐ.ఆర్ మ్యాపింగ్‌పై పూర్తి అవగాహన కల్పిస్తూ, నమోదు ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పట్టణంలోని ప్రతి వార్డులో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తే మ్యాపింగ్ ప్రక్రియ వేగంగా పూర్తి కావడంతో పాటు ఎవరూ ఇబ్బందులు పడరని మొహీద్ పటేల్ తెలిపారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన సబ్ కలెక్టర్ ఎన్. ఉమా హారతి, త్వరలోనే అవసరమైన చర్యలు తీసుకుని హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Blogger ఆధారితం.