తాండ్ర లలితాదేవికి నివాళులర్పించిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు

తాండ్ర లలితాదేవికి నివాళులర్పించిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు


పాల్వంచ: ములకలపల్లి మండలం పొగళ్ళపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వర్గీయ తాండ్ర నారాయణరావు గారి సతీమణి, టీఎన్ఆర్ ట్రస్ట్ అధినేత తాండ్ర వెంకటేశ్వరరావు గారి మాతృమూర్తి తాండ్ర లలితాదేవి గారి చిత్రపటానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం తాండ్ర కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, లలితాదేవి గారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ధైర్యం కలగాలని ఆకాంక్షిస్తూ, ఈ లోటును భర్తీ చేయడం కష్టమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత, 1వ డివిజన్ కార్పొరేటర్ సుగుణ, 2వ డివిజన్ కార్పొరేటర్ భవిత-కిరణ్ దంపతులు, 45వ డివిజన్ కార్పొరేటర్ దంతెబోయిన నరేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ తాండ్ర ప్రభాకర్, కొత్తగూడెం పట్టణ ఓబీసీ అధ్యక్షుడు జయప్రకాశ్ యాదవ్, టీఎన్ఆర్ ట్రస్ట్ కోఆర్డినేటర్ ఇనుగటి రాము, నరాటి ప్రసాద్, తాండ్ర బుచ్చిబాబు, తాండ్ర నాగబాబు, ఎన్‌ఎస్‌యూఐ మండల అధ్యక్షుడు గుంట్రూ సాయి తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.