సీనియర్ జర్నలిస్ట్ TA9News CEO మజీద్ పుట్టినరోజు వేడుకలు

 

సీనియర్ జర్నలిస్ట్ TA9News CEO మజీద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన దిశ ఉమెన్ ప్రొటెక్షన్ చైర్ పర్సన్ వాసర్ల నాగమణి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సీనియర్ జర్నలిస్ట్, TA9News CEO, చీఫ్ ఎడిటర్ ఎం.ఏ. మజీద్ పుట్టినరోజు వేడుకలను దిశ ఉమెన్ ప్రొటెక్షన్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంస్థ చైర్‌పర్సన్ వాసర్ల నాగమణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సామాజిక కార్యకర్తలు, మహిళా నాయకులు, జర్నలిస్టులు, అభిమానులు పాల్గొని మజీద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించి, కేక్ కట్ చేయడంతో పాటు పూల బొకేలు అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మాట్లాడిన దిశ ఉమెన్ ప్రొటెక్షన్ చైర్‌పర్సన్ వాసర్ల నాగమణి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, ప్రజా సమస్యలు, రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తూ మీడియా రంగంలో విశేష సేవలు అందిస్తున్న మజీద్ సేవలను కొనియాడారు.

ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందిస్తూ, సామాన్యుల గొంతుకగా నిలుస్తున్న TA9News సంస్థ ప్రజల్లో విశ్వసనీయతను సంపాదించుకుందని ఆమె పేర్కొన్నారు. జర్నలిజాన్ని బాధ్యతగా భావించి నిరంతరం ప్రజా సమస్యలపై స్పందిస్తున్న మజీద్ మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ, మీడియా రంగంలో మజీద్ చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. సామాజిక చైతన్యానికి మీడియా ఒక ఆయుధంగా మారాలని, ఆ దిశగా TA9News చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో 

ఈ సందర్భంగా మజీద్ మాట్లాడుతూ, తన పుట్టినరోజును ప్రత్యేకంగా నిర్వహించిన దిశ ఉమెన్ ప్రొటెక్షన్ సంస్థ చైర్ పర్సన్ వాసర్ల నాగమణికి, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరింత బాధ్యతాయుతమైన వార్తలను అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

Blogger ఆధారితం.