గొంతుకోసిన ప్రేమోన్మాది.. స్కూల్ టీచర్ మృతి
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమను నిరాకరించిందనే కక్షతో ఓ ప్రేమోన్మాది ప్రైవేట్ స్కూల్ టీచర్‌పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు.
స్థానికుల వివరాల ప్రకారం.. యువతి బస్సు దిగి ఇంటికి వెళ్తున్న సమయంలో నిందితుడు అడ్డగించి గొంతు కోసి విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాడికి పాల్పడిన నిందితుడిని స్థానికులు పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Post a Comment