కొత్తగూడెంలో వ్యక్తి మృతి.. వివరాలు తెలిపాలని పోలీసుల విజ్ఞప్తి

కొత్తగూడెంలో వ్యక్తి మృతి.. వివరాలు తెలిపాలని పోలీసుల విజ్ఞప్తి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని బార్లీఫీట్ ఏరియాలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

కొత్తగూడెం వన్ టౌన్ సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు తోట రాంబాబు, స్వస్థలం మచిలీపట్నం. వయస్సు సుమారు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండవచ్చని తెలిపారు. చామనచాయ రంగుతో, మెడలో జంధ్యం ధరించి ఉన్న ఈ వ్యక్తి రైస్ గ్రాండ్‌లో క్లీనర్‌గా పనిచేస్తూ, జాన్సీ హాస్పిటల్ సమీపంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.

సోమవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో పని ముగించుకొని గదికి వెళ్తుండగా మెట్ల దగ్గర పడిపోయినట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసిన వారు క్రింది నెంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.

  • 8712682017 – IOP
  • 8712682020 – SI-2
Blogger ఆధారితం.